"విలువైన వీలునామా"
ఒకప్పుడు సందడిగా వుండి ఇపుడు, నిర్మానుష్యంగా వున్న ఒక పెద్ద మండువా ఇల్లు. చుట్టూ పచ్చని పొలాలు ప్రకృతమ్మకు పచ్చని చీర కట్టినట్టనిపించేలాంటి పల్లెటూరు వాతావరణం. సమయం సాయంత్రం ఐదు గంటలవుతుంది. శంకరయ్య పొలం పనులు పూర్తిచేసుకుని ఇంటకి వచ్చాడు. భర్త రాకకోసంఎదురు చూస్తున్న పార్వతమ్మ , భర్త రాకను గమనించి ఎదురుగా వెళ్ళి చెంబుతో నీళ్ళిచ్చి కాళ్ళు కడుక్కోమంది.కాళ్ళు కడుక్కుని అరుగు మీద వున్న మడత కుర్చీలో సేదదీరాడు శంకరయ్య. "ఏవండీ భోజనం వడ్డించమంటారా" అడిగింది పార్వతమ్మ. "కాసేపాగి తింటానులే పార్వతి" బదులిచ్చాడు శంకరయ్య. పనిలో అలసిపోయిన తన భర్తను అలసట నుండి బయటపడేలా చేసే ప్రయత్నంలో భర్త కాళ్ళవద్ద కుర్చుని కాళ్ళు నొక్కుతూ వుంది. “ఏవండీ పండుగ దగ్గర పడుతుంది. ఇంటికి సున్నాలు వేయాలి.ఇల్లంతా పేడతో అలకాలి. ముగ్గులు పెట్టాలి. ఇలా చాలా పనులువున్నాయండి. ఇవన్నీ చేసే ఓపిక నాకు లేదండి.పెద్దోడిని, నడిపోడిని, పిలిపించండి. కోడళ్ళు కూడా వస్తారు కదా. కాస్త సాయ పడతారు" అని తన మనోభావాన్ని భర్తకు తెలియజేసింది.నీ పిచ్చి కాకపోతే , చెప్పుల్లో కాళ్ళెట్టుకుని వుండే వారు ,పెళ్లికి ముందు రెండు మూడు రోజుల ముందు ఎలా వస్తారే ఎర్రి మొఖమా" వారు రారనే నిరాశ ఆవహించిన స్వరంతో శంకరయ్య తిరుగు సమాధానమిచ్చాడు. "వస్తే వస్తారు లేక పోతే నేనే చేసుకుంటాను" అని తెంగింపు మాటలతో లేచి నిలబడి అవతల వాకిలితుడిచి కళ్ళాపు వెయ్యాలని చెప్పి పార్వతమ్మ వాకిలి తుడవడానికి వెళ్ళింది. శంకరయ్య ఆలోచనలో పడ్డాడు. పెద్దకోడలు చేసిన నిర్వాకం గుర్తుచేసుకుంటూ.. కళ్ళు మూసుకున్నాడు.
***
పెద్దకొడుకు సత్యానందం.ప్రాధమిక విద్య వరకే పరిమితమైంది సత్యానంద చదువు. పెళ్ళికి ముందు తండ్రికి చేదోడు వాదోడుగా వుండేవాడు. అప్పటికి మిగతా ఇద్దరు ఇంకా చిన్నవాళ్ళు. ఉన్న భూమిలో అపరాలను, ధాన్యాలను,మూడు పంటలను పండించి ఏ లోటు లేకుండా గౌరవంగా బ్రతికే వారు. పెళ్ళీడు కొచ్చిన సత్యానందానికి సంబంధాలు చూస్తూన్నాడు శంకరయ్య. తన చెల్లెలు శారదకు కుమార్తె వున్నదని తెలిసి సంబంధం మాట్లాడటానికి పట్నానికి పెళ్లాడు. అతిథి సత్కారాలతో ఆహ్వానించింది శారద. ఏంటి అన్నయ్య వదినా, పిల్లలు ఎలా వున్నారు. అంతా క్షేమమే కదా. పైకి గౌరవాన్ని నటిస్తూ , లోన "ఈయన గారు ఎప్పుడూ లేనిది ఇలా వచ్చాడేంటి ? ఏం అడగడానికో" అని సందేహం ఆవహించిన మనసుగలదై అన్నయ్యతో మాట్లాడుతుంది శారద. శంకరయ్య తాను అక్కడికి వచ్చిన విషయాన్ని శారదకు తెలియజేస్తుండగా , ఇంతలో "అమ్మా..ఎవరే ఆయన అంటూ " అక్కడకి వచ్చింది చంద్రకళ. " సత్యానందానికి చంద్రకళ సరైన ఈడు జోడు "అని మనసులో అనుకున్నాడుశంకరయ్య. అమ్మా .. చంద్రకళ నేను నీకుమావయ్యనౌతానమ్మ. కొంచెం మజ్జిగ తీసుకురామ్మ అని" తనని అక్కడ నుండి లోనికి పంపించి , తాను వచ్చిన విషయాన్ని తెలియజేసాడు శంకరయ్య. చంద్రకళను సత్యానందానికిచ్చి పెళ్ళి చేయటం లో తనకి అభ్యంతరం ఏమి లేదని, ఒకసారి ఆయనను, అమ్మాయిని అడిగి మీకు కబురు చేస్తానని తన అంగీకారాభిమతాన్ని , అన్నయ్యకు తెలిపింది శారద. అన్నయ్య ఇంటికి వచ్చిన విషయాన్ని, పెళ్ళి విషయం గురించి,శారద తన భర్త , నాగరాజు కు చెప్పింది. నాగరాజు తనకీ వాళ్ళసంబంధం , ఇష్టమేనని అమ్మాయిని ఒకమారు అడిగి , కుదుర్చుకందాం అని నాగరాజు బదులిచ్చాడు. చంద్రకళ కూడా తనకు సత్యానందాన్ని పెళ్ళిచేసుకోవడం ఇష్టమేనని చెప్పడంతో నిశ్చితార్థానికి మూహూర్తం పెట్టించమని శారద, శంకరయ్యకు కబురంపింది. పెళ్ళి అట్టహాసంగా జరిగింది. చంద్రకళ కోడలుగా ఇంటికి వచ్చింది. పట్టణ వాతావరణానికి అలవాటుపడిన చంద్రకళకిపల్లెటూరు వాతావరణం ఇబ్బందిగా అనిపించింది. అలా నాలుగైదు సంవత్సరాలు గడిచాయి. చంద్రకళకు ఆ ఊరిలో వుండటం ఇష్టం లేక , తన భర్తను పుట్టింటికి తీసుకుపోయి అక్కడే కాపురం పెట్టింది. పెద్దకొడుకు ఇల్లు వదలి వెళ్లేసరికి శంకరయ్యకు చేయివిరగినంత పనయ్యింది.
***
ఇంతలో కళ్ళాపు జల్లి, తన పని పూర్తిజేసుకుని శంకరయ్య వద్దకు వచ్చింది పార్వతమ్మ. ఏవండి.. ఏవండీ.. భోజనం వడ్డిస్తాను లేవండి. మడత కుర్చీలోనుంచి లేచి భోజనానికి కూర్చున్నాడు శంకరయ్య. " పిల్లల్ని రమ్మనమని చెప్పమన్నాను, ఫోన్ చేశారా అని " అడిగింది పార్వతమ్మ. ఇంకా చేయలేదే . చేస్తానులే అని వేరే విషయం గురించి మాట్లాడటం మొదలు పెట్టాడు శంకరయ్య. భోజనం పూర్తయ్యాక అదే కంచంలో తనూ భోంచేసింది పార్వతమ్మ. సమయం రాత్రి తొమ్మిదవుతుంది మంచంమీద
పడుకున్న శంకరయ్య కాళ్ళకు నూనె రాసి మర్థన చేస్తూ.. ఇందాక పిల్లలకి ఫోన్ చేయమన్నాను ఆ వియషయం గురించి ఏమి మాట్లాడలేదు.. ఏమైందండి. అని అడిగింది పార్వతమ్మ. "పెద్దోడికి ఫోన్ చేశాను, వాడు బయటకు వెళ్లాడట. చంద్రకళ మాట్లాడింది. వారికి ఇప్పుడు ఖాళీలేదని రావటానికి కుదరదని, నిర్మొహమాటంగా చెప్పేసిందని జరిగిన విషయాన్ని పార్వతమ్మకు చెప్పాడు శంకరయ్య. మరి రెండో వాడికి ఫోన్ చేసారా అని అడిగింది పార్వతమ్మ. పొద్దున్న చేస్తానులే అని బదులిచ్చాడు శంకరయ్య. ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు.
****
రాత్రి సమయం అర్థరాత్రి పన్నెండున్నరవుతుంది. చిన్నకొడుకు వద్దకు వెళ్ళి పండక్కి ఇంటికి రమ్మని పిలిస్తే , కోడలు తనని అవమానించి, పంపించినట్టు కలగని ఉలిక్కిపడి నిద్రనుంచి లేచాడు శంకరయ్య. పార్వతమ్మ కూడా నిద్రనుంచి మేల్కొనింది. ఏమైందండి ఉన్నట్టుండి ఉలిక్కిపడి లేచారు. అడిగింది పార్వతమ్మ. ఏం లేదు పార్వతి చిన్న పీడకల వచ్చింది. కొన్ని మంచినీళ్లు తీసుకుని రా. అనగా పార్వతి మంచినీళ్ళు తెచ్చి శంకరయ్య కు ఇచ్చింది. మంచినీళ్లు తాగి శంకరయ్య దిండు మీద తలవాల్చుకుని నిదురపోదామని ప్రయత్నం చేస్తుండగా తన రెండవ కుమారుడు కమలాకర్ ఇల్లు వదిలి వెళ్ళినప్పటి సంఘటననుతలచుకుంటూ నిదురపోయాడు శంకరయ్య.
***
సత్యానందం తరువాత శంకరయ్యకు కలిగిన సంతానం కమలాకర్. అన్న సత్యానందం ఇల్లువదిలివేరు కాపురము పెట్టినప్పటినుండి , తండ్రికి పొలం పనుల్లోను , ఇంటి పనుల్లోను సహాయడుతూ ఎలాగోలా కష్టాలు పడి డిగ్రి చదివాడు. ఆ ఊరికి యాబై కిలోమీటర్ల దూరంలో ఒక ప్యాక్టరీలో ఉద్యోగంలో చేరాడు. రోజూ ఇంటి వద్దనుండే ప్రయాణం చేస్తూవుండేవాడు. కమలాకర్ తన తమ్ముడిని చదివిస్తూ, ఇంటికి డబ్బులు ఇస్తూ వుండేవాడు. ఇలా జరుగుతూవుండగా కమలాకర్ కు తన సహఉద్యోగిని అయిన రాజేశ్వరి తో పరిచయం ఏర్పడింది. రాజేశ్వరి అందచందాలు, అణకువ చూసి కమలాకర్ రాజేశ్వరితో ప్రేమలో పడ్డాడు. తనకి ఇష్టమైతే తనని పెళ్లి చేసుకుంటానని ,తన ప్రేమ విషయాన్ని రాజేశ్వరికి తెలియజేశాడు కమలాకర్. రాజేశ్వరి కూడా కమలాకర్ ని ఇష్టపడింది.
రాజేశ్వరికితోడబుట్టినవారెవరు లేరు. ఈమె ఒక్కతే సంతానం కావడం వల్ల ఇల్లరికం వచ్చే అల్లుడికోసం వెతుకుతున్నాడు రాజేశ్వరి తండ్రి జగన్నాధం. రాజేశ్వరి , నేను ప్రేమించుకుంటున్నామని ధైర్యం చేసి , రాజేశ్వరి తండ్రి జగన్నాథానికి చెప్పాడు కమలాకర్. తన కూతురిని పెళ్ళి చేసుకునే వాడు తన ఇంటికి ఇల్లరికం రావాలని షరతు విధించాడు జగన్నాథం. ఆ షరతుకు కట్టుబడి వుంటానంటే తనకూతురిని ఇచ్చి పెళ్ళి చేసేందుకు తనకి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పాడు జగన్నాథం. పెళ్ళికి అంగీకరించి నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, పెళ్ళైన తరువాత ఇల్లరికం గురించి ఆలోచిద్దాం లే అని , జగన్నాధం షరతును నిర్లక్ష్యం చేశాడు కమలాకర్. రాజేశ్వరీ, తనూ, ప్రేమించుకుంటున్నామన్న విషయం, తన మావగారు పెళ్ళికి అంగీకరించిన విషయం శంకరయ్యకు చెప్పాడు కమలాకర్. జగన్నాథం పెట్టిన షరతును పెడచెవిన పెట్టి, ఆ విషయాన్ని మరచిపోయాడు. శంకరయ్యకు కూడా చెప్పలేదు. ఎలాగైతేనేం కమలాకర్, రాజేశ్వరిల పెళ్ళి జరిగిపోయింది. పెళ్లితంతులు అన్ని ముగిశాయి. పెళ్ళై రెండునెలలు అవుతుంది. అల్లుడు కమలాకర్ కి తను పెట్టిన షరతుగురించి గుర్తుచేశాడు జగన్నాథం. కమలాకర్ కి ఏమి చేయాలో తెలియని పరిస్థితి. మరుసటి రోజు సతీసమేతంగా శంకరయ్యవద్దకు వచ్చాడు జగన్నాథం.వియ్యంకుని అకాలాగమనం శంకరయ్యను ఆలోచనలో పడేలా చేసింది. రండి రండి జగన్నాథం గారు..అని సాదరంగా ఆహ్వానించాడు శంకరయ్య. ఏమీ తెలియనట్టు వున్న శంకరయ్య పై చిరు కోపంతో ఏమండి అల్లుడెక్కడున్నాడు. ఒక సారి పిలవండి అని కోపంగా అన్నాడు జగన్నాథం. అంతలోగా కమలాకర్ అక్కడికి వచ్చాడు. నేను పెట్టిన షరతును మరచిపోయావా అని గట్టిగా కమలాకర్ ని అడిగాడు జగన్నాథం. తనికివేమీ తెలియని శంకరయ్య తెల్లమొఖం పెట్టి చూస్తున్నాడు ఏమి జరుగుతున్నదో అని. ఇల్లరికం షరతు గురించి శంకరయ్యకు చెప్పి, ఇల్లరికానికి పంపించకపోతే తన కూతురిని తీసుకెళ్ళిపోతానని గట్టిగా చెప్పి వెళ్ళిపోయాడు జగన్నాథం. పెళ్లికి ముందు ఈ విషయం ఎందుకు చెప్పలేదని కమలాకర్ ని నిలదీశాడు శంకరయ్య. పెళ్ళికి అంగీకరించిన ఆనందంలో అవేమి పట్టించుకోలేదని , తాను ఇల్లరికం వెళ్ళడానికినిశ్చయించుకున్నానని శంకరయ్యతో చెప్పాడు కమలాకర్. నువ్వు ఇటినుండి వెళితే నేను చచ్చినంత పని అవుతుందని, ఇల్లరికం వెళ్ళడానికి కుదరదని , తేల్చి చెప్పాడు శంకరయ్య. మరుసటి రోజు ఉదయాన్నే , తన భార్యను వెంట బెట్టుకుని తెగదెంపులు చేసుకుని ఇల్లు వదిలి వెల్లిపోయాడు కమలాకర్. ఆ విధంగా తన రెండో కొడుకు కూడా ఇంటి నుండి వేరు పడటం శంకరయ్య ను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. అప్పటి నుండి చిన్న కొడుకు సుబ్రహ్మణ్యం శంకరయ్య పార్వతమ్మ మాత్రమే ఇంటిలో వుండేవారు.
***
తెల్లవారింది.గుమ్మాలు, వాకిలి శుభ్రపరచి టీ పెట్టి తీసుకువచ్చి శంకరయ్యను నిద్ర లేపుతుంది పార్వతమ్మ. ఏవండీ..ఏవండీ.. లేచి టీతాగండి. త్వరగా తాగకపోతే చల్లారిపోతుందండి లేవండి. నిద్రనుంచి లేచి టీ తాగి, కాలకృత్యాలు తీర్చుకుని, అలా ఆ మడత కుర్చీలో కూర్చున్నాడు శంకరయ్య.ఏవండీ పొలానికి వెళ్ళరా అని అడిగింది పార్వతమ్మ. "ఒంట్లో నలతగా వున్నదని కాసేపాగి వెళతానని" బదులిచ్చాడు శంకరయ్య. ఒక సారి మన కమలాకరం కి పోన్ చేయండి. పండక్కి రమ్మని చెప్పండి. ఫోన్ తీసి కమలాకరం కి పోన్ చేసాడు శంకరయ్య. ఫోన్ రింగ్ అవుతుంది కాని ఎవరు స్పందించటం లేదు. తర్వాత చేద్దాం లే పార్వతి నాకు కొంచెం చల్దన్నం పెట్టు. పొలానికి వెళ్ళాలి. అనగానే పార్వతమ్మ చల్దన్నం తీసుకొచ్చి పెట్టింది. భోజనం పూర్తిచేసి శంకరయ్య పొలానికి బయలు దేరాడు. పార్వతమ్మ మధ్యాహ్నానికి కావలసిన వంటచేయడానికి వంటగదిలోకి వెళ్ళింది. సమయం వుదయం పదకొండున్నర అవుతుంది. ఎవరో వచ్చినట్టయింది. పార్వతమ్మ బయటకి వచ్చి చూసింది. పార్వతమ్మ కనులు ఆనందంతో వేయి చంద్రుల కాంతితో నిండిపోయాయి.ఆవచ్చింది మరెవరో కాదు చిన్న కొడుకు సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు. వచ్చిరాగానే పార్వతమ్మ కాళ్ళపై బడి నమస్కరించాడు సుబ్బు. పైకి లేపి , గుండెలకు హత్తుకుంది పార్వతమ్మ. హమ్మయ్య ఇపుడు కాస్త సంతోషంగా వుందిరా సుబ్బు. మీ అన్నలు, వదినలకు కాళీ లేదట, ఇక్కడకు రావటానికి. అని వారిపై ఏవగింపుతో మాటలాడింది పార్వతమ్మ. సరేలే అమ్మ నేనొచ్చేశానుగా , నాన్నగారు ఎక్కడ..? పొలానికి వెళ్ళారా ,, అని తనే ప్రశ్న వేసి , బదులిచ్చుకున్నాడు సుబ్బు. "స్నానం చేసి రా అన్నం వడ్డిస్తాను" అంది పార్వతమ్మ . వడ్డించ డానికి అన్నింటిని సిద్దం చేసింది పార్వతమ్మ. ఆరు నెలలు గా అమ్మచేతి వంటకు దూరమైన సుబ్బు , అమ్మ చేతివంట తినాలనే ఆత్రుత తో త్వరగా స్నానం ముగించి వచ్చాడు. అమ్మ చేతి వంటలోని కమ్మదనాన్ని ఆశ్వాదిస్తు భోజనం చేయటం ముగించాడు. అలా నాన్నగారి వద్దకు వెళ్ళి వస్తానమ్మ.. అని పొలంలోకి బయలు దేరాడు సుబ్బు. సుబ్బు అలా వెళ్ళగానే పక్కింటి సరస్వతి, పార్వతమ్మ వద్దకు వచ్చింది. మీ చిన్నోడొచ్చినట్టున్నాడు. ఇంతకీ మీ చిన్నోడిది ఏ వుద్యోగం. ఏం చేస్తున్నాడని ఆరా తీసింది సరస్వతి."వాళ్ళ చిన్నన్న కమలాకర్ ,సుబ్బుని ఇంజినీరింగ్చదివించాడని, ఇపుడు కలకత్తాలో వుద్యోగం చేస్తున్నాడని నెలకు అరవైవేల జీతం అని"చిన్నకొడుకు గొప్పతనాన్ని గర్వంగా చెప్పుకుంది పార్వతమ్మ.. ఓహో అలాగా , "నా మతిమరుపు తగలెయ్య నేనొచ్చిన్న పని మర్చి పోయాను, కాస్త పోపు దినుసులుంటే ఇవ్వు పార్వతమ్మ, అని వచ్చిన పనిని చక్కబెట్టుకుని వెళ్లిపోయింది పక్కింటి సరస్వతి. సమయం మధ్యాహ్నం 1:30 అవుతుంది. పొలానికి వెళ్ళిన శంకరయ్య, సుబ్బు ఇంటికి తిరిగి వచ్చారు. కాళ్ళు,చేతులు కడుక్కొని అలా అరుగుపై కూర్చుని మాట్లాడుకుంటున్నారు. శంకరయ్యమాటలు సుబ్బుకు కొత్తగా అనిపించాయి. ఎపుడు లేనిది నాన్నగారు ఇలా మాట్లాడున్నారేంటా..?? అని సందేహపడ్డాడు. గతకొన్ని రోజులగా ఆరోగ్యం అంత బాగుండటం లేదని, పొలం పనులు చేయలేక పోతున్నానే సారాంశాన్ని , శంకరయ్య మాటల్లో గ్రహించాడు సుబ్బు. తాను కలకత్తా నుండి వచ్చి, ఊరికి దగ్గరలోనే ఎక్కడైనా ఉద్యోగం చూసుకుందాం అని నిశ్చయించుకున్నాడు సుబ్బు. ఇంతలో శంకరయ్య ఫోన్ మోగుతుంది. ఆ కాల్ కమలాకర్ నుండి వచ్చింది. శంకరయ్య ఫోన్ ఎత్తి " ఏరా కమలాకర్ ఎలావున్నావు..?? పిల్లలు కోడలు అంతాబాగున్నారా.. చిన్నోడు ఉదయమే వచ్చాడు . వాడితో మాటల్లాడతావా అని" మోబైల్ ను సుబ్బుకి ఇచ్చాడు శంకరయ్య. సుబ్బు మాట్లాడుతూ... "అన్నయ్య ఇంటిదగ్గర అమ్మ ఒకత్తే పనులన్ని చేసుకోలేకపోతుంది. నువ్వు , వదిన రావచ్చు గదా అన్నయ్య, అని ఫోన్ మాట్లాడటం ముగించాడు సుబ్బు. ఇంతలో అక్కడికి వచ్చింది పార్వతమ్మ. రారని తెలిసి ఎగతాళిగా.. ఏరా సుబ్బు ఏమన్నాడు మీ చిన్నన్న , పండక్కి రెండ్రోజుల ముందు వస్తాన్నారా..కమలాకర్ రావటానికి కుదరదని చెప్పడంతో సుబ్బు మాటల్లో నిరాశా భావాన్ని గ్రహించిందిపార్వతమ్మ. సరే వాళ్ళేలాగూ రారు కాని రేపటినుండి ఇంటిపనుల్లో కొంచెం నాకు సాయపడమని సుబ్బుని అడిగింది.
***
సుబ్బు సాయంతో ఇంటిపనులన్ని పూర్తిచేసింది పార్వతమ్మ. ఎదురు చూస్తున్న పండుగ రానే వచ్చింది. కానీ సత్యానంద్ గాని, కమలాకర్ గాని ఎవ్వరూ రాలేదు. “రాక పోయిన ఫర్వాలేదులే అని పైకి అన్నా గాని లోపల పండుక్కి , కొడుకులు, కోడళ్ళు,రాలేదని దిగులు పడింది పార్వతమ్మ. పచ్చతోరణాలతో వుండాల్సిన గుమ్మాలు రోజు లానే వున్నాయి. ఇంటిముందు ఆకాశమంత వాకిలి, నక్షత్రాల్లాంటి చుక్కలతో వేసిన ముగ్గుల లేక మబ్బు పట్టినట్టు కనిపిస్తుంది.ఇంట్లో ఏదో విషాదం అలుముకుంది. ఊరిలో వున్నవారంతా పండుగ చేయడం మానేసి శంకరయ్య ఇంటి వద్దనే వున్నారు. పట్టు బట్టలు, పిండి వంటల, పండుగ జరగాల్సిన ఇల్లు ఏడుపులు పెడబొబ్బలతో నిండిపోయింది. నిన్నటి వరకు బాగానే వున్న శంకరయ్య రాత్రికి , రాత్రే నిద్రలో మరణించాడు. తన భర్త మరణాన్ని సహించలేని పార్వతమ్మ నిచ్చేష్టురాలై అలా కుదేలై పడివుంది. తండ్రి హఠాత్ మరణాన్ని సుబ్బు జీర్ణించుకోలేక పోయాడు. పండుగ జరగాల్సిన ఇల్లు శోకంలో మునిగి పోయింది. పండుగకి రావటానికి వీలుపడదన్న , కమలాకర్ , సత్యానందం తండ్రి మరణ వార్త విని , దిగ్బ్రాంతిచెంది, హుటాహుటిన బయలు దేరి వచ్చారు. జరిగిందేదో జరిగింది , ఇక జరగాల్సింది కానిద్దాం అని, తండ్రికి దహన సంస్కారాలు జరిపించారు ముగ్గురు కొడుకులు. శంకరయ్య మరణంతో , పార్వతమ్మ ఒంటరిదైపోయింది. తల్లిని ఆ పరిస్థితిలో వదిలి వెళ్ళవద్దని, కొన్ని రోజులు ఇక్కడే వుండమని అన్నలిద్దరిని ప్రాధేయపడ్డాడు సుబ్బు. వారికి ఉండటం ఇష్టం లేక పోయిన , కొన్నిరోజులుఅక్కడే వుండటానికి నిశ్చయించుకున్నారు.
***
అలా నెల రోజులు గడిచాయి , ఒకనాడు శంకరయ్య గదిలో ఒక దస్తావేజుల కట్ట కనబడింది సుబ్బుకి. దస్తావేజులు అన్ని తీసి చదువుతున్నాడు. ఫలానా దగ్గర ఇంత భూమి కొన్నాం. వేరే దగ్గర అర యెకరం కొన్నాం అని ఇలా భూమి తాలూక దస్తావేజులు కనిపించాయి. అందులో వీలునామా కూడ వుంది. ఆ వీలునామ ఈ విధంగా వుంది.
***
“ముగ్గురు కొడులకులను ముచ్చటగా కన్నాను . నా కొడుకులు నన్ను , నా భార్యను బాగాచూసుకుంటారని ఎంతో ఆశ పడ్డాను. ఒక్క ఆడ పిల్లైనా కలగలేదే అని ఇపుడు బాధపడుతున్నాను.కొడుకులని కంటాం కాని వారి రాతలని కనలేం కదా. అందుకే నా కొడుకులు నన్ను , నా భార్యను ఒంటరి వాళ్ళను చేసి దూరంగా వెళ్ళి పోయారు. చేయిపట్టుకుని నడక నేర్పించిన తరువాత నడక వచ్చిన కుర్రవానికి జాగ్రత్తగా నడువుబాబు అని చెబితే నేను జాగ్రత్తగానే నడుస్తాను ముందుమీరు జాగ్రత్తగా నడవండి, అని వయసు మళ్ళిన తండ్రి పక్కన నిలబడి చేయూతనివ్వవలసింది పోయి , "మీరు నాకు జాగ్రత్తలు చెప్పడం ఏంటి , నా నడక నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం" అని నా నుండి దూరంగా వెళ్లిపోయిన నా కుమారులని చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే నా పరిస్థితే భవిష్యత్ లో వారికీ వస్తుందేమోనని. నా అర్థాంగి కి నేను చాలా ఋణపడి వున్నాను. తాళి కట్టినది మొదలు ఎటువంటి కష్టాలు ఎదురైనా అన్ని అనుభవిస్తూ నాతో ఇంతకాలం ప్రయాణించింది. ఈ దాంపత్య సుఖప్రయాణం నుండి నేను వైదొలగితే నా భార్య ఒంటరిదైపోతుంది. నేను లేని నా భార్య కుంగి , కుశించి పోతుంది. అటు కొడుకులు దూరమై, ఇటు నేను దూరమైతే తాను తట్టుకోలేదు. తనని ఏ నాడు కంటనీరు పెట్టనీయను అని చెప్పిన నేను ఏదో ఒకరోజు ఆ పని తనకి తప్పదని తెలుస్తుంది.నేను సంపాదించిన ఆస్తంటూ కొంత వుంది. అది నా ముగ్గురు కొడుకులకి సమానంగా పంచుదామని అనుకున్నాను. కాని ఎవరి వాటా వాళ్ళు తీసుకుని నా భార్యను అశోక వనంలో సీతలా , ఈ లంకంత ఇంటిలో ఒంటరిగా వదిలేస్తారేమోననే భయం నన్ను ఆవహిస్తుంది. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను. నా ఆస్థినంతా నా భార్య పార్వతమ్మ పేరు మీద రాసేస్తున్నాను. నా భార్యను ఒంటరి దాన్నిచేయకుండ
ఈఇంటిలోనే వుంటూ , తన బాగోగులను , తను బ్రతికినన్ని నాళ్ళు సేవలుచేస్తూ నా భార్య తదనంతరం నా ఈ ఆస్తిని అన్నదమ్ములు ముగ్గురు సరిసమంగా పంచు కోవాలాని నేను తీర్మానించడం జరిగినది .”
ఇట్లు కొడుకులను పెంచడంలో విఫలమైన ఓ తండ్రి
కొంతిల్లు శంకరయ్య వ్రాలు (సంతకం)
వీలునామ చదువుతున్న సుబ్బు కళ్ళు చెమ్మగిల్లాయి. రెండు కన్నీటి బొట్లుజారి ఆ కాగితాలపై పడినాయి. తన తండ్రి మనో వేదనను అర్థం చేసుకున్న సుబ్బు, ఆ వీలునామా అన్నలకు చదివి వినిపించాడు. తాము చేసిన తప్పు తెలుసుకుని తల్లిని ఒంటరిగా వదిలి వెళ్ళలేక అక్కడే వుండిపోయారు. ఆ విధంగా తను మరణించి తన భార్య కోరికను నెరవేర్చాడు శంకరయ్య..

No comments:
Post a Comment