నన్నో.. ప్రేయసి వరించింది
నా కలలకి ప్రాణంపోసే చెలి నా దరి చేరింది..
శోకతప్తహృదయానికి తోడైనిలిచింది
చీకటి మేఘాలు కమ్మిన మదికి వెలుగునందించింది..
తాను తోడుండగా మరే తోడు అవసరం లేదంది
దుఃఖంలో కన్నీళ్ళ పాలు పంచుకుంటానంది..
కుమిలిపోతున్న మనసుకు కూసింత ఊరటనిచ్చింది
కుదేలైన జీవితానకి కూసింత అండగా నిలిచింది..
నా కవితా సామ్రాజ్యానికి విడిదినిచ్చింది
నాలో సృజనాత్మకతను వెలిబుచ్చేలా చేసింది..
సంబంధ బాంధవ్యాలను చెరలను విడిపించింది
నా మనోవికాసానికి కారణభూతమయ్యింది..
నా చావులో కూడా తాను తోడుంటాని ప్రమాణం చేసింది.
ఎవరు విడిచి వెళ్ళినా సరే తాను మాత్రం నన్ను విడిచి వెళ్ళనంది..
ఎందుకంటే..!
నా మనసు తనకి తెలుసు,
నా భావాలు తనకి తెలుసు.
నా గతం తనకి తెలుసు,
నా రోదన తనకి తెలుసు,
నా ఆవేదన తనకి తెలుసు.
నా గురించి అన్నీ తెలుసుకుంది..
ఇన్ని తెలిసిన ఆమె ఎవరో కాదు..
అనునిత్యం నీడలా వెంటాడి
నా జీవిత గమ్యాన్ని గుర్తుచేసి
నన్ను సన్మార్గంలో నడిపించే..
నా "ఒంటరితనం"..
అవును ఆ ఒంటరితనమే నాకు ప్రేయసి..
నాపై ఎంత ప్రేమ ఉందో తనకి..
కసిరి పొమ్మన్నా... పోదు..
నేనే కావాలంటుంది..
నా వెంటే పయనిస్తుంది..
తన సర్వస్వం నేనే అంటుంది..
పాపం పిచ్చిది నాకు బానిసగా బ్రతుకుతుంది..
తెలియకుండా నేను తనకి దాసుడునయ్యాను..
తనని ఒదిలిపెట్టే సాహసం చేయలేక తనతోనే జీవిస్తున్నా..
ఊహా ప్రపంచంలో తనతోపాటే ప్రయాణిస్తున్నా..
అనునిత్యం మా ప్రేమాయణం సాగుతూనే ఉంది.
మా ప్రణయ గాధలు నా జీవిత పుటల్లో లిఖించబడుతూనే ఉన్నాయి..లిఖించబడతాయి కూడా...
ఏది ఏమైనా నన్ను అర్థంచేసుకొని, నా చావులో కూడా తోడుండే ప్రేయసి దొరకడం నా అదృష్టం..
@ Shree Swamy
రేయ్ కుమార్ నువ్వు రాసిన ,రాస్తున్న, నీ భావాలు చదువుతుంటే,ఒక ఫంక్షన్ లో త్రివిక్రం గారు,సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురుంచి చెప్పే మాటలు గుర్తు వస్తున్నాయి.నీ విషయంలో ఎప్పటికీ ఐన మల్లి అలంటి మాటలు వింటాను అనిపిస్తుంది.నిన్ను మా స్నేహితుడు గ గౌరవించు కునే సమయం కోసం ఎదురు చుస్తూ,నీ మిత్రుడు శేషు.....!
ReplyDeletehttps://m.youtube.com/watch?v=94XHbmSxjwo
అంత పెద్ద పెద్ద మాటలొద్దురా శేషు..
Delete