బస్ కోసం వేచి చూస్తుంటే, తన సౌందర్యంతో కాస్తంత కాలక్షేపాన్ని కల్గించటానికి దిగివచ్చిన దేవ కన్యలా అనిపించింది.. మాట్లాడాలనే ప్రయత్నం చేసేలోపే తను కనుమరుగయ్యింది.. అంతటి సౌందర్యాన్ని చూసిన తర్వాత నాలో భావుకత పొంగిపొరలి అక్కడికక్కడే ఈ కవిత ఉద్భవించింది. తను మరలా కనిపించకపోవచ్చు.. కాని ఈ కవిత చదివిన ప్రతిసారీ తనే గుర్తొస్తుంది..
ఓ సుందరీ..
కన్నుల పరిచమయ్యింది,కాని..కరచాలనమివ్వకుండా కనుమరుగయ్యావు
నీవు కనిపించినంతసేపు నా మదిచెరువు నీ సౌందర్యంతో నిండిపోయింది.నీవు దూరమయ్యేసరికి గండి పడి ఇలా కవిత రూపంలో బయటకు ప్రవహించింది..
రెండు క్షణాల పరిచయంలో నీ సహజ సౌందర్య లావణ్యానికి కనులు పెదవులై నీ రూపాన్ని వర్ణించసాగాయి..
ఆ వర్ణనలు నీ వరకూ చేరలేక పోయినా నీ అందాన్ని ఆశ్వాదించేటంతటి భాగ్యం కలిగిన కనులు నావైనందుకు నేను చాలా సంతోషిస్తున్నా..
మరలా మరో సారి కనిపిస్తావని కాంక్షతో ఎదురుచూస్తూ ఉండే..
నీ అందాన్ని ఆరాధించే ఓ అజ్ఞాత ప్రేమికుడు
---శ్రీ స్వామి---

చాలా బాగుంది శ్రీ స్వామి గారు
ReplyDeletethank u sir..
Delete