నేనే నీ ప్రపంచం అన్నావు..
అమితంగా ప్రేమించానన్నావు..
నాతో జీవితాన్ని పంచుకుంటానన్నావు..
చూడకుండా ఉండలేన్నావు..
మాట్లాకుండా మనలేనని అన్నావు..
నాతో ఉంటే జగమంతా కొత్తగా ఉందన్నావు..
ప్రేమ అనే మత్తు మందు జల్లి
మత్తులోంచి తేరుకునే లోగా దూరమయ్యావు..
అప్పటి నుండి నీ జాడ తెలియక,
నీ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ నిన్ను వెతికాను...
తీరా నిన్ను కలిశాక నేనెవరో తెలియనట్టు నావైపు చూసిన ఆ చూపులు పగిలిపోయిన గాజుముక్కపై సమ్మెట పోటులా మనసును ఛిన్నాభిన్నం చేశాయి
ఉబికివస్తున్న కన్నీళ్ళతో..హృదయం బరువెక్కింది,
నీ ప్రశ్నార్థక చూపులకి..మేను చలించింపోయింది,
నీ గొంతునుండి నాపేరు వెలువడక..గొంతు తడారిపోయింది..
నీ పలుకరింపు వినబడక..నోరు మూగవోయింది,
నీపై నాకు ఎలాంటి కోపమూలేదు..
నాకు ఆ భవంతునిపైనే కోపం..
నన్ను అంతగా ప్రేమించిన నువ్వే నన్ను మరచిపోయినపుడు,
నేను, నిన్ను మరచిపోకుండా చేసిన ఆ భగంతునిపైనే నా కోపమంతా..
తెలుగు సాహిత్య అభిమానిగా, ఒక కవిగా,చిత్రకారునిగా ఎదిగే ప్రయత్నం లో నా భావనలు పంచుకోవటానికి ఈ బ్లాగ్.
Thursday, 13 October 2016
ఎడబాటు - ఆవేదన
Labels:
శ్రీ స్వామి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment